![]() |
.webp)
ఢీ షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఆడియన్స్ ని అలరించింది. ఐతే భూమిక పెర్ఫార్మెన్స్ కి ముందు పండు విజయ్ బిన్నీ మాష్టర్ దగ్గరకు వచ్చి "మీరెంత పెద్ద తప్పు చేశారో తెలుసా అబ్బాయిలతో పోటీ పడే ఏకైక కెపాసిటీ ఉన్న అమ్మాయి భూమిక అంటూ పొగిడారు. ఆ మాటకు ఆ అమ్మాయి పిచ్చెక్కి పోయి ఎలాంటి డాన్స్ లు చేస్తుందో తెలుసా" అంటూ భూమిక చేసిన డాన్స్ ని చూపించాడు. ఇక సాంగ్ ఐపోయాక భూమికకు వోట్ చేశారు జడ్జెస్ కూడా. తర్వాత నందు పండుని స్టేజి మీదకు పిలిచాడు. "ఇటుక మీద ఇటుక పెడితే" సాంగ్ పండు ట్రేడ్ మార్క్ సాంగ్ ఐపోయింది అని చెప్పాడు. ఆ సాంగ్ వైరల్ ఐనందుకు ఒక మాషప్ వీడియోని ప్లే చేసి చూపించారు. ఇక పండు గురించి ఆది మాట్లాడాడు."మనోడు ప్రతీ సీజన్ లో తన మార్క్ ని క్రియేట్ చేసేవాడు.
.webp)
ప్రతీ సీజన్ ఇంకో లెవెల్ కి వెళ్ళడానికి హెల్ప్ చేసేది పండునే. ఈ సీజన్ ఇంత బాగా హైలైట్ అవడానికి కారణం పండు ఆరోజు చేసిన ఇటుక మీద ఇటుక సాంగ్. వచ్చి ఏదో సాంగ్ చేసి వెళ్ళిపోదాం అని అనుకోడు. ఏదో కొత్తగా చేయాలి మిగతా వాళ్ళ కంటే డిఫెరెంట్ గా థింక్ చేయాలి అనుకుంటాడు. ప్రతీ సీజన్ తన మార్క్ ని నిలబెట్టుకోవడానికి చూపే తపన విషయంలో పండుకు హ్యాట్సాఫ్" అంటూ చెప్పాడు. ఇక పండు మాట్లాడాడు. "ఇంత రెస్పాన్స్ చూసాక చాల హ్యాపీగా ఉంది. నా గురించి ఎవరు మాట్లాడినా వినాలనిపిస్తుంది. కానీ ఆది అన్న మాట్లాడితే ఇంకా వినబుద్దేస్తుంది. ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఈరోజు నా గురించి మాట్లాడేసరికి చాల ఎమోషనల్ గా ఫీలయ్యా.
నన్ను మా డాడీ వాళ్ళ కంటే బాగా పెంచింది మా బాబాయ్. వాళ్లకు నేను చదువుకోవడం ఇష్టం. కానీ నేను డాన్స్ వైపు వచ్చేసాను. అలాంటి బాబాయ్ ఢీ 15 టైములో ఫస్ట్ టైం నా గురించి ఏడుస్తూ ఒక మాట అన్నారు. అరేయ్ నువ్వు సక్సెస్ కావడం నేను చూడాలి అని. ఢీ ఇచ్చే ప్రోత్సాహం చాలా బాగుంటుంది. నాకు ఎలాంటి ప్రైజ్ వద్దు అనిపిస్తుంది. కానీ ఇన్ని సీజన్స్ నుంచి చేస్తున్నా కానీ కప్పు కోసం ఈ సీజన్ ట్రై చేస్తున్నా. మాక్సిమం ట్రై చేసి ఫైనల్స్ వరకు వెళ్తా మాష్టర్." అని చెప్పాడు. ఇక నందు మాట్లాడాడు.."వీడికి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను అని చెప్తాను ఎందుకంటే నాకు తెలిసి నాకు మించిన కాంప్లిమెంట్ ఇవ్వరు. ఇస్తారో లేదో తెలీదు. ఒక రోజు నేను ఒకరిలా బతకాలి అని దేవుడు వరం ఇస్తే వీడిలా బతకాలని ఉంది" అని చెప్పాడు నందు.
![]() |